Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

పోలీస్ పాత్రలో శర్వానంద్

sharvanandశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై శర్వానంద్ హీరోగా సీనియర్ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినూత్నమైన కథలు, మంచి నటనతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న శర్వానంద్ ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. శర్వ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా కనిపించే ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్రమోహన్ పనిచేస్తున్నారు. ఆయన గతంలో కరుణాకరన్ వద్ద పనిచేసిన టెక్నీషియన్. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది.  నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులు, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది”అని అన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం తెలిపింది.

Comments

comments