Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మారుతితో శర్వానంద్ చిత్రం

sharvanandస్క్రిప్ట్ విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటూ విభిన్నమైన చిత్రాలను చేస్తూ రాణిస్తున్న యంగ్ హీరో శర్వానంద్. వరుస విజయాలతో జోరుమీదున్న ఈ కథానాయకుడు కొత్త సినిమాలను ఒప్పుకునే విషయంలోనూ అదే ఉత్సాహం చూపిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ పూర్తి కావడంతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు శర్వానంద్. త్వరలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. శర్వాకి మారుతి చెప్పిన కథ నచ్చిందని… త్వరలోనే సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిసింది. ఇప్పటికే ‘మహానుభావుడు’ అనే పేరును మారుతి రిజిస్టర్ చేయించడంతో శర్వానంద్ మూవీ ఇదేనని అంటున్నారు. వీలైనంత త్వరగా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రంలో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్ మెహ్రీన్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు దర్శకుడు మారుతి.

Comments

comments