Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను మొదలెట్టిన శర్వానంద్

sharvanandసంక్రాంతి ఫ్యామిలీ హీరో అనిపించేసుకుంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్.  సంక్రాంతికి భారీ చిత్రాలతో తన సినిమా ‘శతమానం భవతి’ని పోటీగా రిలీజ్ చేసి మరీ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు శర్వానంద్ తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. ‘శతమానం భవతి’ షూటింగ్ జరుగుతున్నప్పుడే రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు శర్వానంద్. వీటిలో ఒకటి దర్శకుడు మారుతితో చేయాల్సి ఉంది. కానీ ఈ చిత్రానికి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో… ఆతర్వాత అనుకున్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా ఫైనల్ చేయగా… ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనుండడం విశేషం.

Comments

comments