Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మాఫియా డాన్‌గా శర్వానంద్

sharva

‘స్వామిరారా’ వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు సుధీర్‌వర్మ. ఆతర్వాత అతను చేసిన దోచెయ్, కేశవ పర్వాలేదనిపించాయి. ఇప్పుడు సుధీర్‌వర్మ… శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయడానికి కమిటయ్యాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ అన్నీ కుదిరినా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి ఆలస్యమైంది. ‘మహానుభావుడు’ తర్వాత ఈ చిత్రం చేయాల్సిన శర్వానంద్… హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ సినిమా మొదలుపెట్టాడు. ఆ చిత్రాన్ని దాదాపు సగం పూర్తిచేశాడు. ఈ చిత్రం తర్వాత సుధీర్‌వర్మతో శర్వానంద్ సినిమా మొదలవుతుందట. ఈ చిత్రం కోసం కోటి రూపాయల ఖర్చుతో భారీ సెట్ నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. కొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ మొదలవుతుందట. శర్వానంద్ మాఫియా డాన్ పాత్రలో కనిపించబోయే ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా సాగుతుందని తెలిసింది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు.

Comments

comments