Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

శర్వానంద్‌తో సందీప్ చిత్రం

Sharwanand

‘అర్జున్ రెడ్డి’ మూవీతో దర్శకుడిగా సందీప్ వంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు టాలీవుడ్ మాత్రమే కాదు… ఇండియన్ స్క్రీన్ చూడని ఓ బోల్డ్ క్యారెక్టర్‌ను సృష్టించిన ఘనతను ఆయన దక్కించుకున్నాడు. సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పాత్ర ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు సందీప్ వంగా నెక్స్ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తన కొత్త సినిమాను ఎవరితో చేస్తాడు… ఈసారి ఎలాంటి పాత్రను హీరో కోసం సృష్టించబోతున్నాడనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. ఈ విషయంలో సందీప్ వంగా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడని తెలిసింది.

టాప్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరో శర్వానంద్‌తో ఈ దర్శకుడు తన కొత్త సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు దర్శకుడు సందీప్ వంగా. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్‌కు చాలానే అవకాశాలు వచ్చినా… తన స్టైల్‌లో మూవీ మేకింగ్‌కు సై అనే వారికే మొగ్గు చూపాలన్నదే ఈ దర్శకుడి ఆలోచన. అందుకు తగినట్లుగానే శర్వానంద్‌తో సినిమా ఓకే అయిందట. ఆది హీరోగా ‘చుట్టాలబ్బాయి’ చిత్రాన్ని నిర్మించిన వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. శర్వా నటించిన ‘మహానుభావుడు’ సినిమా విడుదల తర్వాత ఈ కొత్త సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Comments

comments