Home తాజా వార్తలు శశికపూర్ ఆరోగ్యంపై పుకార్లు నమ్మొద్దు

శశికపూర్ ఆరోగ్యంపై పుకార్లు నమ్మొద్దు

SHASHIముంబయి : వెటరన్ బాలీవుడ్ నటుడు శశికపూర్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు ప్రజలకు తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కపూర్ కుటుంబీకులు తమ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శశికపూర్ ఆరోగ్యంగానే ఉన్నారని వారు స్పష్టం చేశారు. రిషి కపూర్ కూడా తన ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు. శశికపూర్ ఆరోగ్యంపై పుకార్లు సృష్టించొద్దని ఆయన కోరారు.