Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

సల్మాన్ తో నటించే అవకాశం వచ్చింది: కాంగ్రెస్ ఎంపి

Salman-Khan

ముంబయి: సల్మాన్ తో కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని శశిథరూర్ ఇంటర్య్వూలో తెలిపారు. సోషల్ మీడియా స్టార్ జానిస్ సీక్వెర్ తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఓ గొప్ప సినిమాకు సల్మాన్ తో నటించే అవకాశం వచ్చినందుకు సంతోష పడ్డాను. ఆ మూవీలో విదేశాంగ మంత్రి కనిపించాలని సదరు డైరెక్టర్ కోరారని పేర్కొన్నారు. కానీ స్నేహితుడు సూచనతో ఆ చిత్రంలో తాను నటించలేదని వెల్లడించారు. ఆ చిత్రంలో విదేశాంగ శాఖ మంత్రిగా నటించాలని డైరెక్టర్ కోరారని, కానీ ఆ పాత్రకు ఒప్పొకోవద్దని తన ప్రియమిత్రుడు సలహా ఇచ్చాడని చెప్పారు.  ఇక అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు నటించిన అందాజ్‌ అప్నా అప్నా చిత్రంలో తాను క‌నిపించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు పుకార్లేనని వెల్లడించారు. రాజకీయల్లో వచ్చిన తరువాతనే సినిమా ఆఫర్లు వస్తున్నాయని, యంగ్ లో అందంగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదని  శశి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments