Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శర్వానంద్‌తో ‘శతమానం భవతి’

sharvanand‘శతమానం భవతి’ అనే టైటిల్‌పై సినిమా చేస్తానని అప్పుడెప్పుడో చెప్పాడు దిల్‌రాజు. సతీష్ వేగేశ్నను దర్శకుడిగా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యాడు కూడా. కానీ ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. మొదట మెగా హీరో సాయిధరం తేజుతో ‘శతమానం భవతి’ చేయాలని భావించిన దిల్‌రాజు ఆతర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హ్యాట్రిక్ హిట్స్‌తో ఊపు మీదున్న యంగ్ హీరో రాజ్‌తరుణ్ దగ్గరకు కూడా ఈ సినిమా వెళ్లింది. కానీ చివరికి అతన్ని కూడా కాదనుకున్నారు. తర్వాత నేచురల్ స్టార్ నానితో ఈ సినిమా చేసే అవకాశాలున్నాయనే వార్తలొచ్చాయి. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ‘శతమానం’ భవతి’కి ఎట్టకేలకు హీరో దొరికాడు. యంగ్ హీరో శర్వానంద్‌తో ఈ చిత్రాన్ని తీసేందుకు ఓకే అయింది. శర్వా కూడా ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ మూవీతో సతీష్ వేగేశ్న దర్శకుడిగా పరిచయం కానుండగా.. కొత్త గెటప్‌తో ఈ హీరో దర్శనమిస్తాడని తెలిసింది. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియరా నున్నాయి. మొత్తానికి ముగ్గురు హీరోలను దాటి శర్వా చేతికి చేరింది ‘శతమానం భవతి’.

Comments

comments