Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

మార్ష్ సెంచరీ, ఆసీస్ భారీ స్కోరు

Shaun-Marsh

ఆడిలైడ్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం దిశగా పావులు కదుపుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 442 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లాండ్ ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 29 పరుగులు సాధించింది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌కు మరో 413 పరుగుల దూరంలో ఇంగ్లాండ్ నిలిచింది. ఓపెనర్ అలెస్టర్ కుక్ (11), జేమ్స్ విన్స్ (౦) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ మార్క్ స్టోన్‌మన్ 18 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు 209/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హాండ్స్‌కొంబ్ (36) కిందటి స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన వికెట్ కీపర్ పైన్‌తో కలిసి షాన్ మార్ష్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పైన్ ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 57 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన మార్ష్ 231 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో పాట్ కమిన్స్ ఏడు ఫోర్లతో 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు.

Comments

comments