Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలు

Mother - Daughter Committed Suicide

అమరావతి: ప్రియుడిని ప్రియురాలు సజీవదహనం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొంకలమిట్ల మండలం చౌటపల్లి గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రియుడు షేక్ షబ్బీర్(32) , ప్రియురాలు షకీరా(28) మధ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరికి పెళ్లిలు అయినప్పటికి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగతున్నాయి.  ప్రియుడిని శృంగారం చేసుకుందామని ప్రియురాలు షకీరా తాను పని చేసే కోళ్ల షెడ్ కు రమ్మని పిలిచింది. ప్రియుడిని ఇనుప మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. షబ్బీర్ అరుపులు, కేకలు వేయడంతో బావుల దగ్గర రైతులు అక్కడికి చేరుకున్నారు. అప్పడికే పూర్తిగా కాలిపోయి అతడు దుర్మరణం చెందాడు. షబ్బీర్ ను తానే హత్య చేశానని వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆమె లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments