Search
Sunday 18 November 2018
  • :
  • :

పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ధర్నా

Strike

 

 

 

మన తెలంగాణ/అర్వపల్లి : ప్రేమించి పెండ్లి చేసుకుంటానని మోసం చేసి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మంగళవారం ధర్నా చేసింది.పెండ్లి చేసుకోవాలని మహిళ సంఘాలతో పాటు ఇంటి ఎదుట బైఠాయించింది. రామన్నగూడెం గ్రామానికి చెందిన రమావత్ గౌతమ్‌కు మండలపరిదిలోని కాసర్లపాడు ఆవాసం తూర్పుతండాకు చెందిన ధరావత్ కవిత సూర్యాపేటలో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రెండుసార్లు అబార్షన్ చేయించాడని అమ్మాయి పేర్కొంది. పెద్ద మనుషులు, పోలీసుల సమక్షంలో గతంలో పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాటమార్చారని, తనకు న్యాయం చేయాలంటూ మహిళ సంఘా లను ఆశ్రయించింది. మంగళవారం మహిళ సంఘాలతో ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదన కూర్చింది. ఆమె వెంట మహిళ సంఘాల నాయకురాలు సారగొండ్ల వెంకటమ్మ, బొమ్మిశెట్టి భారతమ్మ, గూగుంట్ల పద్మ, భాషబోయిన మహాలక్ష్మి,కోసూరి హేమలత, గోపెల్లి ఎల్లమ్మ లు ఉన్నారు.

 

Comments

comments