Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

Lover

దేవరకొండ: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టిన ఘటన మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి మండలం మూసాపేట ప్రాంతంలో జరిగింది. ప్రియుడి ఇంటి ముందు నిరాహార దీక్షకు కూర్చున్న ప్రియురాలు స్పప్న దీక్షను పోలీసులు భగ్నం చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. నల్లకుంటకు చెందిన స్వప్న 2011 సంవత్సరంలో ఎస్‌పి కళాశాలలో చదువుకునే సమయంలో మోతీనగర్‌లోని అవంతినగర్‌కు చెందిన ఎ.లోకేష్‌గౌడ్‌ అనే సహ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. కాలేజీలో ఉన్నప్పుడు లోకేశ్ గౌడ్ ప్రేమిస్తున్నాని ప్రేమ వ్యక్తం చేయడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆరు నెలల కింద స్వప్న పెళ్లి చేసుకుందామని లోకేశ్ కు చెప్పడంతో ముఖం చాటేశాడు. బాధితురాలు అప్పుడు నల్లకుంట పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ పెళ్లి విషయం ఎత్తగానే లోకేశ్ గౌడ్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వప్న, మహిళా సంఘాలతో కలిసి  తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని లోకేశ్ గౌడ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. బుధవారం సాయంత్రం వరకు ఆమె నిరసన చేపట్టినా అతడు అక్కడికి రాలేదు.  సనత్ నగర్ ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు.

Comments

comments