Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష

               Love

హైదరాబాద్‌ః ప్రియుడి ఇంటి ముదు ప్రియురాలు మౌన దీక్షకు దిగింది. తనని పెళ్లిచేసుకుంటానని ప్రశాంత్ రెడ్డి మోసం చేసాడని, ఐదేళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని నేరేడ్‌మెట్‌కు చెందిన షమీరా తెలిపింది. బస్వాపూర్‌లో గురువారం ఉదయం నుంచి ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు డబ్బా పట్టుకొని షమీరా దీక్షకు దిగింది. ఐదేళ్ల నుంచి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నామని, పెళ్లి విషయానికి వచ్చే సరికి ప్రశాంత్ తప్పించుకొని తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ రెడ్డితో పెళ్లి జరిపించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొంది. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను ఆమె తీయడంతో స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ప్రియుడు ప్రశాంత్ రెడ్డి, ప్రియురాలు షమీరాను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Comments

comments