Home తాజా వార్తలు ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

                         Lover

పెద్దపల్లి: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైటాయించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన శశిధర్ (20), ముద్దుల రుచిత(18), గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే… పెళ్లి పేరు ఎత్తగానే శశిధర్ మొహం చాటేశాడని, ప్రియురాలు  ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడంలేదని, మాట్లాడం లేదని ప్రియురాలు రుచిత శశిధర్ ఇంటి ముందు ధర్నాకు దిగింది.