Home తాజా వార్తలు ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు..

ఇప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు..

Shedding Crocodile Tears for Farmers said by Modi

లక్నో: రైతుల పేరు మీద ఇప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పథకాలు ఎందుకు కనిపించలేదని ప్రజలు అడగాల్సిన సమయం ఆసన్నమైందని దుయ్యబట్టారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు పర్యటిస్తున్నారు. కేవలం బాన్‌సాగర్ ప్రాజెక్టు మాత్రమే  పెండింగ్ లో లేదని దేశవ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలో రైతుల సంక్షేమంతో ముడిపడి ఉన్న అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని, అలాగే ఉండిపోయాయని ధ్వజమెత్తారు. రాజకీయాల పేరుతో రైతులు పండించే పంటకు మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేశాయని మండిపడ్డారు.