రాజన్న సిరిసిల్ల : యాదవులు ధనవంతులుగా ఎదగాలని మంత్రి కెటిఆర్ అన్నారు. సిరిసిల్లలో రాష్ట్రస్థాయి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కెటిఆర్ సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు 30యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. గతేడాది 60లక్షల గొర్రెలను పంపిణీ చేశామని చెప్పారు. వాటి సంఖ్య ఇప్పుడు 80లక్షలకు చేరుకుందని తెలిపారు. గొర్రెల పంపిణీ కోసం సిఎం కెసిఆర్ రూ.5వేల కోట్లు ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ నుంచి విదేశాలకు మాంసం పంపిణీ చేసే స్థాయికి యాదవులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.