Home జోగులాంబ గద్వాల్ రాయితీ గొర్రెలు పట్టివేత

రాయితీ గొర్రెలు పట్టివేత

SHEEPS

జోగులాంబ గద్వాల : తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన రాయితీ గొర్రెలను అక్రమంగా తరలిస్తుండగా ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఉండవల్లి టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నాలుగు వ్యాన్లలో 250 గొర్రెలను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల సందర్భంగా 250 గొర్రెలను పట్టుకుని, పది మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Sheeps Capture