Home సంగారెడ్డి అక్రమార్కులపై విద్యాశాఖ కొరడా!

అక్రమార్కులపై విద్యాశాఖ కొరడా!

 Shifting trails for points in transitions

బదిలీల్లో పాయింట్ల కోసం అడ్డదారులు తొక్కిన గురువులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్లను మరోసారి వైద్య బృందం పరిశీలించింది.  ఈ మేరకు శనివా రం మొదటి రోజు మెడికల్ బోర్డుకు పలువురు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తమ రుజువులు చూపే సర్టిఫికేట్లతో హాజరయ్యారు. వీరిలో దాదాపు 30 మంది వరకు ఉపాధ్యాయులు తమను సాధారణ కేటగిరి కిందనే పరిగణించాలని కోరుతూ తమ మెడికల్ బోర్డు జారీ చేసిన దరఖాస్తులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఈ రోజు పరీక్ష ల అనంతరం మిగిలిపోయిన వారిని ఆదివారం పరీక్షించనున్నారు. గైర్హాజ రైన వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోం ది. ఈ నేపథ్యంలో మన తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం.

దాదాపు మూడు సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన కోరుకున్న స్థానానికి చేరుకోవాలనే కొందరి గురువు ల దుర్దుద్దేశ్యం చివరికి అందరికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఉపాధ్యాయుల మె డికల్ సర్టిపికేట్ల వ్యవహారంలో దరఖాస్తు సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు చో టు చేసుకున్నాయనే వార్తలు రావడం, ఈ విషయం పైన మరోసారి దర్యాప్తు చే యాలని కలెక్టర్‌కు అర్హులైన వారు ఫిర్యా దు చేయడంతో మెడికల్ బోర్డు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. వారి పిర్యాదుతో కలెక్టర్ ఎవరైతే ఈ దరఖాస్తుల సమయంలో మెడికల్ బోర్డు ద్వారా సర్టిపికేట్లు పోందారో వారందరూ తిరిగి మరోసారి మెడికల్ బోర్డు కు హాజరై తమ వ్యాధి నిర్దారించే ధ్రువపత్రాలు సరిచూయించుకోవాలని మెదక్ ఉమ్మడి జిల్లా విద్యాధికారి విజయలక్ష్మీ గత రెండు రోజుల కిందట ఆదే‘శాలు జారీ చేశారు. అందులో భాగంగా శ ని, ఆదివారాల్లో అనారోగ్య పాయింట్లతో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నా రో వారంతా సంగారెడ్డి లోని మెడికల్ బోర్డులో మరోసారి ధ్రువ పరుచుకున్న తరువాతే మెడికల్ కేటగిరి కింద అనుమతిస్తామని అధికారులు హెచ్చరించడంతో శనివారం మెడికల్ బోర్డు ఆసుపత్రి ఆవరణ ఉపాధ్యాయులతో నిండిపోయింది. మెదక్, సంగారెడ్డి రెండు జిల్లాలకే కలిపి ఈ సారి బదిలీలలో మొత్తం దాదాపు 230 మంది ఉపాధ్యాయులు అనారోగ్య నేపథ్యంలో తమకు పాయింట్లు కేటాయించాలని ముందుగా దరఖాస్తు చేసుకున్నారు.

అయితే మెడికల్ బోర్డు వ్యవహారం పై ఆరోపణలు రావడం, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు జిల్లాల డిఈఓగా ఉన్న ఈ. విజయలక్ష్మీ దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు వారి భర్తలు, పిల్లలకు వైద్యపరీక్షలు చేయించాలని నిర్ణయించారు. అయితే నిజాయితీగా, నిబద్దతో వ్యవహారించాల్సిన ఉపాధ్యాయులే ఇలా అడ్డదారులు తొక్కడం పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పైగా ఒక ఉపాధ్యాయ సంఘం ముఖ్య నేత సైతం ఇందులో కల్పించుకుని అక్రమ సర్టిపికేట్లు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు కూడా లేకపోలేదు. శనివారం మెడికల్ బోర్డు సర్టిపికేట్ల పరిశీలన కార్యక్రమం కొనసాగింది. అనారోగ్య కారణంతో ఉపాధ్యాయులు బదిలీల్లో ముందు వరుసల్లోకి వెళ్లనున్నారు. అనారోగ్యంలో కూడా కేటగిరిలను నిర్దారించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక స్పష్టమైన ఉత్తర్వు కూడా జారీ చేసింది. ప్రిఫరెన్షియల్ కేటగిరిలో ఏ కేటగిరి కింద పిజికల్లీ చాలెంజ్డ్, బి కేటగిరి కింద విడోస్, సి కేటగిరి కింద లీగల్లీ సపరేటేడ్, డి కేటగిరి కింద క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోను టిబి, కిండర్డ్ హార్ట్ ట్రాన్స్‌పంటేషన్, ఈ కేటగిరి కింద చైల్డ్ మెంటల్లీ రిటారైడ్, లుకేమియా వ్యాధి గ్రస్తులు, ఎఫ్ కేటగిరి కింద చిలడ్రన్ హార్ట్ హోల్, జి కేటగిరి కింద చిలడ్రన్ జువైనల్ డయాబెట్స్‌గా ఉన్నది. ఈ కేటగిరిలలో దరఖాస్తు చేసుకున్నవారందరిని కాకుండా కేవలం మెడికల్ బోర్డు ద్వారా గుర్తించే వారినే మరోసారి పరిక్షిస్తున్నారు. ఈ కేటగిరిలో నిర్దేశించిన విడోస్, లీగల్లీ సెపరెటెడ్ అంటే విడాకులూ పొందిన వారు తమ తమ లీగల్ డాక్యుమెంట్లు సమర్పించారు. వారిని ఈ పరీక్షల నుంచి మినహాయించారని తెలిసింది. శనివారం సాయంత్రం వరకు దాదాపు మందిని పరిక్షించినట్లు అసుప్రతి వర్గాలు తెలిపారు. సంగారెడ్డిలోని డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. నలుగురు వైద్యుల బృందం ఉపాద్యాయులను పరిశీలించింది. ఇందులో ఒకరు మహిళా వైద్యురాలున్నారు. దాదాపు 50 మంది దరఖాస్తులను శనివారం సాయంత్రం వరకు పునఃపరిశీలన చేశారు. రాత్రి 7 గంటలైనా ఇంకా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

30 మంది స్వచ్చందంగా వెనక్కి : ఇదిలా ఉంటే మెడికల్ బోర్డు ద్వారా ధ్రువ పత్రాలు పొంది బదిలీ పాయింట్లలో అక్రమంగా మార్కులు పొందిన దాదాపు 30 మంది ఉపాధ్యాయులు తమ తమ దరఖాస్తులను వెనక్కి తీసుకున్నారు. తమను సాధారణ కేటగిరిలోనే గుర్తించాలని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. తెలిసి తెలియక మెడికల్ బోర్డును అశ్రయించామని వారంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా తమ దరఖస్తులను వెనక్కి తీసుకునే అవకాశముందని ఒక ఉపాధ్యాయ సంఘం నేత వివరించారు. ఆదివారం సాయంత్రానికి ఈ విషయపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని ఆయన వివరించారు.
నిర్వహించిన పరీక్షలు…