Home తాజా వార్తలు గబ్బర్‌కి కెరీర్‌ బెస్ట్ ర్యాంక్..!

గబ్బర్‌కి కెరీర్‌ బెస్ట్ ర్యాంక్..!

Shikhar Dhawan moves to career-best 24th place in ICC Test rankings
దుబాయి: అఫ్గానిస్థాన్‌తో జరిగినన ఏకైక టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌ని అందుకున్నాడు. ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో గబ్బర్ 10 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ని కైవసం చేసుకున్నాడు. శిఖర్ తో పాటు ఈ టెస్టులోనే శతకం బాదిన మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా ఆరు స్థానాల్ని మెరుగుపర్చుకుని 23వ ర్యాంక్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆతిథ్య భారత జట్టు ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.