మనతెలంగాణ/కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ లోని మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లును నడిపేందుకు ముందుకు వచ్చిన జేకే పేపర్ మిల్స్ లిమిటేడ్ డైరెక్టర్ ఓపి గోయల్ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో సోమ వారం మిల్లులోని విభాగాలను పరిశీలించా రు. ముందు గా కాగజ్‌నగర్ చేరుకున్న డైరె క్టర్ గోయల్‌ను స్థానిక గెస్ట్ హౌస్‌లో ఎమ్మె ల్యే పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలి కారు. అనంతరం ఇరువురు స్థానిక అధికా రులతో కలిసి మిల్లు లోని పలు విభాగాల ను సందర్శించారు. పేపర్ మిల్లు పునరు ద్ధరణలో భాగంగా అడుగులు ముం దుకు పడటంతో ఒక వైపు కార్మికుల్లో, మరో వైపు పట్టణ ప్రజలు ఆనందంవ్యక్తంచేస్తు న్నారు. పేపర్ మిల్లులోని పలుప్లాంట్లను పరిశీ లిం చి మిషన్ల సామర్థం అంశంలో డైరె క్టర్ గోయల్ అడిగితెలుసుకున్నారు.ఈ కార్యక్ర మంలో జేకే అధికా రులు మోహన్ రాయ్, ఎస్పీఎండిజిఎం రమేష్‌రావు, కార్మిక సంఘనేత ఇందారప్ రాజేశ్వర్‌రావు, రమ ణ రావు, కార్మికులు పాల్గొన్నారు.