Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బిగ్‌బాస్‌ సీజన్-1 విన్నర్ శివబాలాజీ

Siva-Balaji

హైదరాబాద్ : గత 70 రోజులుగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్-1లో నటుడు శివబాలాజీ విజేతగా నిలిచాడు. జూ.ఎన్టిఆర్ వ్యాఖ్యతగా తొలిసారిగా తెలుగులో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఒక ఇంట్లో 14 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో ఇద్దరు ఈ హౌస్ లో చేరారు. కాగా ఆడియన్స్ ఓటింగ్ ప్రక్రియతో ఈ షో నుంచి ప్రతీ వారం ఒకొక్కరిగా ఎలిమినేట్ అయ్యారు. చివరిగా మిగిలి ఆదర్శ్, శివబాలాజీల్లో నటుడు శివబాలాజీ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. విజేతకు రూ.50 లక్షలు క్యాష్ ప్రైజ్ అందించారు.

Comments

comments