Search
Thursday 15 November 2018
  • :
  • :

నంది అవార్డులు, ఇతర పురస్కారాల విజేతలకు ‘మా’ శుభాకాంక్షలు

shiva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకుగాను నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అవార్డు విజేతలు అందరికీ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ శుభాకాంక్షలు తెలిపారు. రఘుపతి వెంకయ్య అవార్డు-2014కు ఎంపికైన కృష్ణంరాజుకు, 2016కు ఎంపికైన చిరంజీవికి, నంది పురస్కారానికి ఉత్తమ నటులుగా ఎంపికైన బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలకు ఎంపికైన కమల్‌హాసన్, కె.రాఘవేంద్రరావు, బిఎన్ రెడ్డి పురస్కారాలకు ఎంపికైనా ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, నాగిరెడ్డి-చక్రపాణి పురస్కారాలకు ఎంపికైన ఆర్.నారాయణ మూర్తి, కీరవాణి, కె.ఎస్.రామారావులకు వారు శుభాకాంక్షలు చెప్పారు.

Comments

comments