Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

సిఎం ఫ్లయింగ్ కిస్.. సోషల్ మీడియాలో వైరల్(వీడియో)

Shivraj-Singh-Chouhan's-'fl

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఓ కార్యక్రమంలో ప్రజలకు అభివాదం చేస్తూ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారు. ఆ సమయంలో ఎవరో ఆ సన్నివేశాన్ని వీడియో తీసి అంతర్జాలంలో పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాలను గమనిస్తే ఓ బహిరంగ సభలో సిఎంకు జనాలు తమ వినతి పత్రాలు ఇస్తున్నట్లు ఉంది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలకు సిఎం శివరాజ్‌సింగ్ అభివాదం చేస్తూ… ‘ఐ లవ్యూ’ అంటూ ‘ఫ్లయింగ్ కిస్’ విసరడం వీడియో రికార్డైంది. దీనిపై నెటిజన్లు చమత్కరిస్తూ కామెంట్లు చేస్తున్నారు. వాటిలో ఎక్కువగా ‘మామాజీ… ఐ టూ లవ్యూ’ అనే కామెంట్ కనిపిస్తోంది. ఇక ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన చౌహాన్ అక్కడి మీడియా సమావేశంలో ‘అమెరికా రోడ్ల కంటే మధ్యప్రదేశ్ రోడ్లు బాగున్నాయంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కూడా సిఎంపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. తాజాగా ఫ్లయింగ్ కిస్ వీడియోతో మరోసారి చౌహాన్ సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

Comments

comments