Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హ‌రికృష్ణ మృతి ప‌ట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

Shock of the celebrities, Death of Harikrishna

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, టిడిపి నేత నందమూరి హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు కెఇ, కళా వెంకట్రావు, పరిటాల సునీత, నక్కా ఆనందబాబు, టిడిపి నేతలు రఘురామకృష్ణంరాజు, ఎవి రమణ, ఎల్వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌లతోపాటు పలువురు రాజకీయ నేతలు, సినిమాటోగ్రఫ‌ీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హ‌రికృష్ణ మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. మోహ‌న్ బాబు, మంచు లక్ష్మీ, మ‌నోజ్, కోన వెంక‌ట్‌, అల్లు శిరీష్‌, త‌మ్మారెడ్డి, దేవి శ్రీ ప్రసాద్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, హ‌రీష్ శంక‌ర్ త‌దిత‌రులు హ‌రికృష్ణ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సినీ, రాజ‌కీయాల‌లో ఆయ‌న సేవ‌ల‌ని స్మ‌రించుకున్నారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలికి ఎపి28 బిడ్ల్యూ-2323 అనే నెంబర్ గల కారులో వెళ్తుండగా అన్నెపర్తి దగ్గర డివైడర్‌ను ఢీకొన్న సంఘటనలో హరికృష్ణ మృతి చెందారు.

Comments

comments