Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు షాక్

Nawaz-Sharifలాహోర్ : పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ పనామా పేపర్స్ బయపెట్టిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ రాసిన లేఖను ఆ దేశ జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిఐ సమర్పించిన పిటిషన్‌ను ఎన్నికల కమిషన్‌కు పంపించినట్లు స్పీకర్ అయాజ్ సాధిఖ్ తెలిపారు. తొలుత ఇమ్రాన్‌ఖాన్ తన పార్టీ ఆధ్వర్యంలో షరీఫ్ ఇంటి వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మొహర్రం మాసం ముగిసిన తరువాత షరీఫ్‌ను పదవిలో కొనసాగనివ్వబోమని ఇమ్రాన్ ప్రతిజ్ఞ చేశారు. దేశ రాజ్యాంగం ప్రకారం షరీఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగేఅర్హత కోల్పోయాడని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.

Comments

comments