Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పుణ్యక్షేత్రాల్లో షూటింగ్ బాగా జరిగింది – మహేష్‌బాబు

maheshమహేష్‌బాబు చిత్రం ‘బ్రహ్మోత్సవం’ రోజు రోజుకీ అంచనాలు పెంచుకుంటూ వేసవి కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తర్వాత మహేష్-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తూ వస్తోంది. గత కొద్దిరోజులుగా ఉత్తర భారతదేశంలోని పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తిచేసి ఈ చిత్ర బృందం హైదరాబాద్‌కు తిరిగివచ్చేసింది. ఆతర్వాత ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా మరో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించేశారు ఫిల్మ్‌మేకర్స్. హైదరాబాద్‌లో ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నార్తిండియా షెడ్యూల్ గురించి మహేష్‌బాబు ట్విట్టర్‌లో తెలియజేస్తూ… “హరిద్వార్, ఉదయ్‌పూర్‌లలో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాం. పుణ్యక్షేత్రాల్లో షూటింగ్ అంతా బాగా జరిగింది. ఇంకా కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలిపోయింది”అంటూ మహేష్ రెండు ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను విపిపి సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక నార్తిండియాలో మహేష్‌బాబు, సమంతలపై కొన్ని రొమాంటిక్ సీన్లను తెరకెక్కించారు. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ‘బ్రహ్మోత్సవం’ను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Comments

comments