Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు వ్యతిరేకంగా దుకాణదారులు, వ్యాపారుల నిరసన

BSNS

 దేశంలో వాల్‌మార్ట్ గుత్తాధిపత్యం సాధించాలని చూస్తోంది
 నాణ్యత లేని వస్తువులు దేశీయ మార్కెట్‌లో రానున్నాయి
 ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: సిఎఐటి

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ డీల్‌కు వ్యతిరేకంగా దుకాణదారులు, వ్యాపారులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. దేశీయ ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకునేందుకు ఇటీవల అమెరికా సంస్థ వాల్‌మార్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆందోళన నిర్వహించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మంది వ్యాపారులు దేశవ్యాప్త నిరసనకు దిగారు. సిఎఐటి(అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ మాట్లాడుతూ, బెంగళూరుకు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడం ద్వారా భారత రిటైల్ మార్కెట్‌లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గుత్తాధిపత్యం సాధించాలని చూస్తోందని, అలాగే మామ్ అండ్ పాప్ స్టోర్టను కూడా నడిపేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తోందని అన్నారు. ఈ డీల్ ఒప్పందం కారణంగా తమ వ్యాపారం భారీగా దెబ్బతింటుందని, తమ వ్యాపారాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో సిఎఐటి సోమవారం ధర్నాలకు దిగింది. ఈ ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ డీల్‌కు కారణంగా రిటైల్ మార్కెట్లో గుత్తాధిపత్యం వస్తుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేని వస్తువులను భారత మార్కెట్‌లో చొచ్చుకు రానున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాణిజ్యపరిశ్రమల శాఖ కల్పించుకోవాలని, తక్షణ మే ఇకామర్స్ నియంత్రణ సంస్థను నియమించాలని డి మాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని, ఈమేరకు ఇడికి, సిసిఐకి ఫిర్యాదు దాఖ లు చేసినట్టు వారు తెలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే సుప్రీకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తమ నిరసనను ప్రభుత్వం పట్టించుకోనట్లయితే ఈ నెలలో ఢిల్లీలో ఒక జాతీయ సదస్సు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని ఖండెల్వాల్ హెచ్చరించారు.
ఇటీవల వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య డీల్ కుదిరింది. వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ మధ్య డీల్ విలువ దాదాపు 18 నుంచి 20 మిలియన్ డాలర్లు ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ దాదాపు 70శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌లో వాల్‌మార్ట్‌తో పాటు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఉంది. ఆల్ఫాబెట్ దాదాపు 15శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాలను వాల్‌మార్ట్ కొనుగోలు చేస్తోందని, ఈమేరకు ఒప్పందం కుదిరిందని.. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలను కల్గి ఉన్న సాఫ్ట్‌బ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లోని తమ 20శాతం వాటాను వాల్‌మార్ట్‌కు అమ్ముతున్నట్టు సాఫ్ట్‌బ్యాంక్ సిఇఒ ఇటీవల వెల్లడించారు. దీని విలువ 4బిలియన్ డాలర్లు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంకుతో పాటు టైగర్ గ్లోబల్, నాస్పెర్స్, యాక్సెల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లకు చెరో 5 శాతం వాటా మాత్రమే ఉన్నట్లు సమాచారం. గతంలో అమెజాన్ ఉద్యోగులైన సచిన్, బిన్నీ 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు.

Comments

comments