Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

డైరెక్టర్ యోగి అరెస్ట్

Yogi

హైదరాబాద్: షార్ట్‌ఫిల్మ్ దర్శకుడు యోగిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి హారిక ఫిర్యాదు మేరకు యోగిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  అనంతరం యోగిని పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరపర్చారు. గత ఐదు రోజులుగా యోగి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. యోగి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపింది. డైరెక్టర్ యోగి తనను వేధిస్తున్నాడని నటి హారిక ఫిర్యాదు చేయడంతో అడిషినల్ డిసిపి గంగిరెడ్డి అతడిని దారుణంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Short Film Director Yogi Arrested Today.

Comments

comments