Home అంతర్జాతీయ వార్తలు తెలంగాణ వాసిపై అమెరికాలో కాల్పులు

తెలంగాణ వాసిపై అమెరికాలో కాల్పులు

న్యూయార్క్: అమెరికాలో ఆదివారం మధ్యాహ్నం మళ్లీ కాల్పుల కలకలం సృష్టించాయి. మిచిగాన్‌లో తెలంగాణ వాసిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. మహబూబాబాద్‌కు చెందిన పూస సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. సాయికృష్ణ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. రెస్టారెంట్‌లో సాయి పార్శిల్ తీసుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం సాయి వద్ద ఉన్న డబ్బులు, కారు, గుర్తింపు కార్డులను అపహరించారు. ఎల్లయ్య, శైలజ దంపతుల కుమారుడు సాయి.

 

Shot on Telangana Student in America

Telangana news