Home జాతీయ వార్తలు రాఫెల్ కుంభకోణంపై విచారణ జరిపించాలి : సురవరం

రాఫెల్ కుంభకోణంపై విచారణ జరిపించాలి : సురవరం

SURAVARAM

హైదరాబాద్ : రాఫెల్ కుంభకోణంపై విచారణ జరిపించాలని సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ, అంబానీల ఆస్తులు 80 శాతం పెరిగాయని ఆయన ఆరోపించారు. 15ఏళ్లలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో పాలకవర్గాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష, దళిత, లౌకికశక్తులతో కలిసి ఐక్య పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని ఆయన చెప్పారు.

Should be Prosecuted on Rafael scandal : Suravaram