Home మహబూబ్‌నగర్ పేదరికం శాపం కాకూడదు

పేదరికం శాపం కాకూడదు

povertyస్వయం ఉపాధిలో మహిళలు రాణించాలి
డాన్‌బోస్కో సంస్థ ప్రతినిధి ఫాదర్ అలెక్స్ సూచన
కొల్లాపూర్: పేదరికం శాపం కాకుడదని అది ఒక వరంలా బావించి పేదరికన్ని ఎర్కొవాలని డాన్‌బోస్కో సంస్థ ప్రతినిధి ఫాదర్ అలెక్స్ అన్నారు. సోమవారం పట్టణ సమీపంలోని సెయింటీ మోరీ పాఠశాల అవరణలో రెండు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ నెర్చుకున్న మహిళలకు శిక్షణ సర్టిపికెట్స్ పాదర్ అలెక్స్, పాదర్ పిటర్‌లు ప్రదానోత్సవం చేశారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ, మహిళలు తమ స్వయంగా డబ్బులు సంపాందించుకోని సంఘంలో గౌరవంగా జీవించడానికి ఈశిక్షణ ఉపయోగపడుతుందన్నారు. డాన్‌బోస్కో ఇటలీ దేశంలో పేదరికంలో పుట్టి హోటల్స్‌లో పని చేసి, కుట్టు మిషన్ నేర్చుకోని ఈరోజు పేద ప్రజలకు సేవాలందించే సంస్థను ఏర్పటు చేశారని గుర్తు చేశారు. నేడు ప్రపంచంలో 39 దేశాలలో ఈసంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోని తము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నమని వారు అన్నారు. చిరిగిన బట్టలను ముడివేసినట్లుగా జీవితాన్ని మలుచుకోవాలని వారు సూచించారు. ఈసందర్బంగా మహిళలు తమ మనోగతాన్ని సమావేశంలో పాలుపంచుకున్నారు. తమకు శిక్షణ ఇచ్చినందకు మేము స్వయంగా డబ్బులు సంపాదించుకోంటామని ఆనందం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, అద్యాపకులు ప్రభావతి, శిక్షకురాలు అరుణలు పాల్గోన్నారు.