Home నాగర్ కర్నూల్ సంక్షేమ పథకాలపై ప్రపంచ చూపు

సంక్షేమ పథకాలపై ప్రపంచ చూపు

MLA-marri-image

రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభీక్షంగా ఉంటుంది: రైతు బంధు పథకం ప్రారంభోత్సవంలో ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్‌రెడ్డి

మనతెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రథినిధి: రైతు సంక్షేమంపై తెలంగాణ ప్రభు త్వం అనుసరిస్తున్న పథకాలపై ప్రపంచ చూపు ఉందని రైతును రాజును చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందిని నాగర్ కర్నూల్ ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో రైతు బందు పథకం చెక్కుల పంపిణీ, పాసు పుస్తకాల పంపిణీ కార్య క్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే పాల్గొని ప్రంగించారు. ఈసందర్బంగా మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చినవెంటనరే రైతు రుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, ప్రస్తుతం రైతుల పంట పెట్టుబడుల కోసం ఏడాదికి ఎకరాకు రూ. 8వేల చొప్పున పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించడం జరుగుతందన్నారు. దీంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీ రందిం చాలన్న లక్షంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను చేయడము కాకుండా పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరం దించే పాలమూరు, రంగారెడ్డి పథకాన్ని తీసుకు వచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభు త్వానికే దక్కిందన్నారు.

కల్వకుర్తి ఎత్తి పోతల పథకం ద్వారా నాగర్ కర్నూల్ నియోజక వర్గంలోని ప్రతి చెరువు, కుంటలను నింపడం జరిగిందన్నారు. ఎండా కాలంలోను చెరువులు నిండు కుండాల్లా తలపిస్తు న్నయన్నారు. తాము ఇంతా చేస్తున్న తమ ఉనికిని చాటు కోవడానికి కాంగ్రేస్, బీజేపీ లాంటి పార్టీలు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వారికి తగిన రీతిలో ప్రజలే బుద్ది చెప్పా లన్నారు. దేశంలో ఏప్రధానికి, ఏముఖ్య మంత్రికి రాణి ఆలోచన మన ముఖ్య మంత్రి కేసీఆర్‌కు రావడం తెలంగాణ రైతులు చేసుకున్న అదృష్టంగా ఆయన అభివర్ణించారు. రైతు బందు పథకం ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజన్నారు.

కాంగ్రేస్ తీరు తాము రైతులకు ప్రజలకు ఏమి చేయలే దని, మీరుకూడా ఏమి చేయవద్దన్న చందంగా ఉందని మర్రి ఎద్దేవ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీదర్ మాట్లాడుతూ 1955లో భూములను సర్వే చేయడం జరిగిం దని, ఆ తర్వాత తెలంగాణలో ఇప్పుడే పూర్తి స్థాయిలో సర్వే జరిగిందన్నారు. అభివృద్ది చెందిన అస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో భూసర్వే చేయడానికి 10 నుంచి 15 ఏళ్లు పడితే మన ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం రాత్రిం బవల్లు కష్ట పడి కేవలం ఆరు నెలలో పూర్తి స్థాయిలో సర్వే చేసి కొత్త పాసు పుస్తకాలను ప్రింట్ చేయడం ఒక రికార్డుగా అభివర్నించారు. పాసు పుస్త కాలు అందించడం నిరంతర ప్రక్రియ అని, చెక్కులను పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా రెవెన్యూ కార్యాలయాలలో చెక్కులను ఇస్తామన్నారు. దశల వారిగా రైతు సమగ్ర అభివృద్దికి పాటు పడే వదింగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు.

మూడు దశలలో ఈప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించే విదంగా ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామాన్నారు. జిల్లాలో 2లక్షల68 వేల మంది రైతులు ఉన్నారని, భూసర్వే 95శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే కలెక్టర్‌లో తాడూరు మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనానన్ని ప్రారంభించారు. మండల టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎద్దుల బండల్లను అలంకరించి ఎమ్మెల్యే, కలెక్టర్‌లను బండ్ల పై ఊరేగింపుగా సభావేదిక వద్దకు తీసుకు వచ్చారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు .జక్కా రఘునందన్ రెడ్డి, వివిద శాఖల అధికారులు, ప్రజా ప్రథినిధులు, సాయిచంద్ కళా బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.