Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

క్రేజ్ తగ్గలేదు

shreya

 ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ లాంగ్ రన్ లో ఎంతో మంది అగ్ర హీరోలతో నటించింది. ఇటీవల  బాలకృష్ణ, నాగార్జునలతో కూడా కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాలం గడిచే కొద్ది సీనియర్ హీరోయిన్లకు డిమాండ్ తగ్గిపోతుండగా శ్రియాకు మాత్రం డిమాండ్ పెరుగుతుండడం విశేషం. ఇక శ్రియా ఇటీవలే పెళ్లి చేసుకుంది. రష్యాకు చెందిన ఆండ్రూ కోశ్చేవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏదీ లేదని చెప్పింది. పెళ్లయిన కొద్ది రోజుల్లోనే షూటింగ్‌లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది.  సినిమాటోగ్రాఫర్ సుజన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఈ భామది చాలా డిఫరెంట్ రోల్. డీ గ్లామరస్‌గా చేయాలని దర్శకురాలు కావడంతో అలాంటివి చేసేందుకు ఏకంగా రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. అయితే నిర్మాతలు ఆ పారితోషికం ఇచ్చేందుకు ఓకే అన్నారట. దీంతో పెళ్లయినా కూడా ఈ రేంజ్‌లో శ్రియాకు రెమ్యునరేషన్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

comments