Home వార్తలు ‘బాహుబలి- 2’లో శ్రియా

‘బాహుబలి- 2’లో శ్రియా

shreya‘బాహుబలి 2’లో ఢిల్లీ డాల్ శ్రియాశరణ్ ఛాన్స్ కొట్టేసింది. రానాకు జోడీగా శ్రియా ‘బాహుబలి కం క్లూజన్’లో కనిపించబోతోంది. రానా-శ్రియాలకు ఇటీవలే స్పెషల్ ఫొటోషూట్ నిర్వహించింది రాజమౌళి టీం. రా నా పక్కన శ్రియా సరిగ్గా సెట్ అయిందని… అందుకే ఈ బ్యూటీని ఎంపికచేశారని సమాచారం. ప్రస్తుతం రా మోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్‌లోకి శ్రియా త్వరలోనే చేరనుందని తెలిసింది. ఇటీవల సరైన అవకాశాలు లేక ఫేడౌ ట్ అయ్యే స్థితికి చేరుతున్న శ్రియాకు ఇది బిగ్ ఆఫర్ అని చెప్పాలి. దీంతోనైనా శ్రియా సె కండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుందేమో చూడాలి. ప్రభాస్, రానా అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ఉన్న ‘బాహుబలి 2’లో ఇప్పుడు శ్రియా కూడా చేరిపోయిం దన్నమాట.