Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

శ్రీవిష్ణుకు పెద్ద ఫ్యాన్‌నయ్యా శర్వానంద్

vishnuశ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. అరాన్ మీడియా వర్క్, శ్రీవైష్ణవి క్రియేషన్స్ బ్యానర్‌లపై ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు కలిసి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, శర్వానంద్, రాజ్ కందుకూరి, జి.నాగేశ్వరరెడ్డి, దేవీ ప్రసాద్, సురేష్ బొబ్బిలి తదితర ప్రముఖులతో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ “ట్రైలర్ చూడగానే ఈ సినిమా చూడాలనిపించింది. ఇలాంటి మంచి సినిమాలు ఈమధ్య ఎక్కువగా వస్తున్నాయి. గత ఏడాది, ఈ ఏడాది కొత్త దర్శకులు మంచి కథలతో సినిమాలు చేస్తున్నారు. ట్రైలర్ చూసి శ్రీవిష్ణుకి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఇది నా కథలాగా అనిపించింది”అని అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ “ఈ కథను శ్రీవిష్ణు నాకు చెప్పినప్పుడు నా స్నేహితుడు ఒకడు గుర్తుకువచ్చాడు. తను ఇంటర్ చదివే రోజుల్లో నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైతే ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో తను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు. అలాంటి వాళ్ల జీవితాలను తెరపై చూపే చిత్రమిది. అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది”అని చెప్పారు.  శ్రీవిష్ణు మాట్లాడుతూ “దర్శకుడు వేణు ఈ కథ చెప్పగానే ఈ సినిమా చేయాలనిపించింది. పక్కింట్లోనో, ఎదురింట్లోనే ఉంటూ నన్ను గమనించి ఈ సినిమా కథ రాసుకున్నారనిపించింది. నా జీవితాన్ని సినిమాగా చూసుకోవాలని ఈ చిత్రం చేశాను. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని నమ్మాలని చెప్పే చిత్రమిది. అందరికీ దగ్గరగా ఈ సినిమా ఉంటుంది”అని పేర్కొన్నారు.

Comments

comments