Home అంతర్జాతీయ వార్తలు చేయి పని చేయకుండా చేసిన రికార్డు

చేయి పని చేయకుండా చేసిన రికార్డు

ind

66 ఏళ్లుగా గోర్లు తీయక పోవడంతో పడిపోయిన శ్రీధర్ చిల్లాల్ ఎడం చేయి

న్యూయార్క్: ప్రపంచంలోనే పొడవాటి గోళ్లు పెంచిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన భారత్‌కు చెందిన శ్రీధర్ చిల్లాల్ 66 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు తన ఎడం చేతి వేళ్ల గోర్లను కట్ చేసుకున్నాడు కానీ ఇన్నేళ్ల పాటు గోర్ల్లను పెంచడం, వాటి భారం కారణంగా ఆయన ఎడం చేయి శాశ్వతంగా పని చేయని స్థితికి చేరుకుంది. 82 ఏళ్ల చిల్లాల్ గత 66 ఏళ్లుగా తన ఎడం చేతి వేళ్ల గోర్లను ఎప్పుడూ తొలగించుకోలేదు. ఈ కారణంగా గోర్లు 31 అడుగు పొడవు పెరిగాయి. అయితే ఇప్పుడు ఆయన వాటిని తొలగించాలనుకున్నాడు. అంతేకాదు తాను ఇంతకాలం పెంచిన చేతి గోర్లను భద్ర పరాలని కూడా అనుకున్నారు. దీనికి రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం ముందుకు వచ్చింది. ఈ గోర్లను తొలగించే సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం కోసం రిప్లే చిల్లాల్‌ను భారత్‌నుంచి న్యూ యార్క్‌లోని టైమ్ స్క్వేర్‌కు విమానంలో తీసుకు వచ్చిం ది. చిల్లాల్ గోర్లను సొంతం చేసుకున్న ఆ సంస్థ వాటిని న్యూయార్క్‌లోని తమ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనుంది. తొలగించిన చిల్లాల్ గోర్లను ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక గాజు కేస్‌లో బల్లపరుపుగా ఉం చామని, అవి ౩౩ అడుగులు అంటే ఓ మూడంతస్థుల భవనం అంత ఎత్తు ఉన్నాయని రిడ్లే ఒక ప్రకటనలో తెలియజేసింది. చిల్లాల్ 1952నుంచి తన ఎడం చేతి గోర్లను తొలగించుకోలేదు. అయితే కుడి చేతి వేళ్ల గోర్లను మాత్రం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకునే వారు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు తన టీచర్ పోడవాటి వేలి గేరును విరగొట్ట్టారు. అందుకు ఆయన శిక్ష కూడా అనుభవించారు. నేను పెంచిన గోరు ప్రాధాన్యత ఏమి టో నీకు తెలియదని, ఎందుకంటే నీవు ఎప్పుడూ అలాంటి పని చేయలేవని ఆ సందర్భంగా టీచర్ అన్న మాటలను సవాలుగా తీసుకున్న శ్రీధర్ అప్పటినుంచి తన ఎడం చేతి వేలి గోర్లను పెంచడం మొదలుపెట్టారు. అయితే ఇన్నేళ్ల పాటు గోర్లను పెంచడం, దానికి తోడు గోర్ల బరువు కారణంగా ఆయన ఎడం చేయి శాశ్వతంగా పని చేయని స్థితికి చేరుకుంది. ఆయన తన ముడుచుకున్నట్లుగా ఉన్న ఎడం చేయిని తెరవలేరు. అంతే కాదు, ఆయన చేతి వేళ్లు కూడా కదిలించలేని స్థితికి చేరుకున్నాయి.
గర్వంగా ఉంది: రిప్లే
ఇలాంటి ప్రత్యేకమైన వస్తువును ప్రదర్శిస్తున్నందుకు తామెంతో గర్విస్తున్నామని రిప్లే అంటోంది. నిజంగా ఎప్పటికీ మరిచిపోలేని దానికోసం చిల్లాల్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వారసత్వాన్ని గౌరవించడానికి రిప్లేయే సరయిన చోటు. ఆయన తన గోర్లను తొలగించుకొని ఉండవచ్చు కానీ, ఆయన గోర్లను రిప్లేకు చెందిన బిలీవ్ ఇట్ ఆర్ నాట్‌లో శాశ్వతంగా గుర్తుంచుకోవడం జరుగుతుంది’ అని ఆ సంస్థ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ సుజాన్నే స్మగాలా పాట్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సంసార జీవితానికి అడ్డు కాలేదు
చిల్లాల్ అసాధారణ నిర్ణయం ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలు, మనుమళ్లతో సాధారణ జీవితం గడపడానికి ఎలాంటి అడ్డూ కాలేదు. అయితే వయసు మీద పడ్డంతో అంత పొడవైన గోర్లతో ఆయన మామూలు జీవన శైలిని కొనసాగించడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా ఆయన నిద్ర పోవడం కష్టంగా మారింది. చిన్నపాటి గాలి వీచినా నిద్రాభంగం కలుగుతోంది. ఇదిలాఉంటే న్యూయార్క్ టైమ్ స్కేర్‌లోని రిప్లే స్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో 2౦ గ్యాలరీలు, ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన 500కు పైగా అరుదైన కళాఖండాలు ఉన్నాయి.