Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కనువిందు చేస్తున్న శ్రియా

Shriya-sharanఒకప్పుడు సౌతిండియాలో టాప్ హీరోయిన్‌గా తిరుగు లేని క్రేజ్‌ను సంపాదించుకొని నేటికీ అందాల తారగా రాణిస్తోంది శ్రియా శరణ్. 17 ఏళ్లుగా అదే అం దం, గ్లామర్‌తో మైమర పిస్తోంది ఈ బ్యూటీ. నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతక ర్ణి’లో శ్రియా హీరో యిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రియా.. రాణి వశిష్టీ దేవి పాత్రలో కనిపిం చనుంది. సాధార ణంగా ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలను బయటలకు రానివ్వరు. ఈ విషయంలో సినిమా టీం సభ్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ శ్రియా మాత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించిన ఆన్‌లొకేషన్ ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా సినిమాలోని తన లుక్స్‌ను బయటపెడుతూనే ఉంది. పాటలో ఎలా ఉంటుందో… సన్నివేశాల్లో ఎలా కనిపించనుందో… అన్నింటినీ షేర్ చేస్తోంది శ్రియా. అలాగని సినిమా యూనిట్‌కు తెలియకుండా చేస్తున్న లీక్స్ ఏమీ కావు ఇవి. మొత్తమ్మీద శ్రియా ‘గౌతమీపుత్ర…’లో తన లుక్స్‌ను బయటపెడుతూ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంటోంది.

Comments

comments