Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పెళ్లి పీటలెక్కనున్న శ్రియ?

sriya

సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ శ్రియాశరణ్. డెహ్రాడూన్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంటూ స్టార్‌గా కొనసాగుతోంది. ఇప్పటికీ ఆమెకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ బ్యూటీ త్వరలో పెళ్లికి సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే శ్రియా పెళ్లి ఖాయమని అంటున్నారు ఆమె సన్నిహితులు. కొన్ని నెలల క్రితం ఈ భామ రష్యాకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందట. పరిచయమైన కొన్ని వారాల వ్యవధిలోనే ప్రేమలో మునిగిపోవడం… పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం కూడా జరిగిపోయాయట. అంతేకాదు రెండు కుటుంబాలకు చెందిన వారు మాట్లాడుకోవడం కూడా జరుగగా… పెళ్లి ముహూర్తాలు కూ డా పెట్టుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే పెళ్లి వేదిక కూడా ఖరా రు అయిందని సమాచారం. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు శ్రియా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు తన పెళ్లిపై శ్రియా అధికారికంగా స్పందించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె… పెళ్లి విషయంలో తనకు ఇంట్లో నుంచి వత్తిడి పెరుగుతోందని చెప్పింది. అప్పటికే ఈ పెళ్లి ఖరారు అయి ఉంటుందని అం దుకే అప్పుడు శ్రియా ఆ మాట చెప్పి ఉంటుందని అంటున్నారు.

Comments

comments