Home సినిమా జాక్‌పాట్ ఆఫర్…

జాక్‌పాట్ ఆఫర్…

Shriya Saran

 

కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలకృష్ణ కొత్త సినిమా ఈమధ్యే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్‌గా సీనియర్ బ్యూటీ శ్రియా శరణ్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. బాలయ్యతో శ్రియా ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించింది. చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

చివరి రెండు సినిమాలు ఈమధ్య వచ్చినవే. శ్రియా నటన, ప్రొఫెషనలిజంపై బాలయ్యకు మంచి గురి ఉందట. అందుకే ఎక్కువ ఆలోచించకుండా శ్రియాను ఎంపిక చేశారని సమాచారం. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. శ్రియా ఒక హీరోయిన్ కాబట్టి రెండవ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఇక ఈ ఆఫర్ శ్రియాకు జాక్‌పాట్ లాంటిదేనని అనుకోవచ్చు.

Shriya Saran as the heroine of Balakrishna’s new film

Related Images: