Home సినిమా షార్క్‌లతో కలిసి ఈతకొట్టిందట!

షార్క్‌లతో కలిసి ఈతకొట్టిందట!

Shriya

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ఇప్పటికీ రాణిస్తుండం విశేషంగా చెప్పుకోవాలి. ఈమధ్యన బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేసి హీరోయిన్‌గా మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. అటు నటనతో పాటు ఇటు గ్లామర్‌లోనూ యంగ్ హీరోయిన్‌లకు ధీటుగా కనిపిస్తోంది శ్రియా. తాజాగా ఈ భామ మాల్దీవ్‌లకు హాలీడే టూర్‌కు వెళ్లింది. అక్కడ ఈ ముద్దుగుమ్మ ఓ పెద్ద సాహసమే చేసిందట.

ఈ భామ ఏకంగా షార్క్ చేపలతో కలిసి ఈత కొట్టేసిందట. “నేను మాల్దీవ్‌ల సముద్రం మధ్యలో బోట్‌లో గడ పడం… నా  జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. అక్కడ పలు రకాల షార్క్‌లను చూశాను. అంతేకాదు వాటితో కలిసి ఈత కొట్టాను కూడా. రాత్రిపూట డైవింగ్ చేశాను. అసలు వెనక్కి రావాలని అనిపించ లేదు”అని చెప్పింది శ్రియా శరణ్. ప్రస్తుతం ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తిచే సింది ఈ భామ. హిట్ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత తెలుగులో ఆమెను పలు చిత్రాలకు పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఏ తెలుగు సినిమా కూడా ఖరారు కాలేదు.