Search
Wednesday 21 November 2018
  • :
  • :

శృతి కొత్త అవతారం

Shruti Haasan grand entry into Bollywood

సంజయ్‌దత్ ‘లక్’ సినిమాతో పరిచయమైన కమల్‌హాసన్ కూతురు శృతిహాసన్ చాలా ఏళ్లు కష్టపడితే కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. పవన్‌కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్‌సింగ్’ సినిమా అకస్మాత్తుగా ఆమె జాతకాన్ని మార్చేసింది. ఆతర్వాత రవితేజ ‘బలుపు’, మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి శృతిహాసన్‌ను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయి. గత ఏడాది పవన్‌కళ్యాణ్‌తో ‘కాటమరాయుడు’లో కనిపించాక తమిళ్‌తో సహా ఏ భాష సినిమాలోనూ ఆమె కనిపించలేదు. అయితే తన ప్రియుడు మైకేల్ కోర్సోల్‌తో తరచుగా మీడియాకు కనిపిస్తూ సందడి చేస్తోంది ఈ భామ. ఇటీవల ముంబయ్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌వాక్ చేసి హల్‌చల్ చేసింది శృతిహాసన్. అయితే శృతి ఇకపై సినిమా నిర్మాణంతో పాటు మ్యూజిక్ వీడియోలపై పూర్తిగా దృష్టి సారిస్తుందట. ఇప్పటికే తల్లి సారికతో కలిసి తమిళ్, హిందీలో సినిమాలు తీయడానికి సిద్ధమవుతోంది. ఇకపై సినిమాల్లో నటించే విషయం మాత్రం స్పష్టంగా చెప్పని శృతి మ్యూజిక్ డైరెక్టర్‌గా కొత్త అవతారం ఎత్తబోతోంది. గతంలో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన ఈ బ్యూటీ స్టార్‌గా బిజీ అయ్యాక ఆ పని చేయడం లేదు. కానీ ఇప్పుడు మళ్లీ మ్యూజిక్ ఆల్బమ్స్ రూపొందించాలనుకుంటోంది శృతిహాసన్.

Comments

comments