Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నటన ఒక్కటే నాకు ముఖ్యం కాదు

Shruti Haasan signs Mahesh Manjrekar film starring

విశ్వనటుడు కమల్‌హాసన్ ముద్దుల కూతురిగా తెరంగేట్రం చేసిన శృతిహాసన్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో సత్తా చాటి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. అయితే దాదాపు ఏడాది కాలంగా  శృతిహాసన్  సినిమాలకు దూరంగా ఉంటోంది. తెలుగులో ‘కాటమరాయుడు’ తమిళంలో ‘సింగం 3’, హిందీలో ‘బెహెన్ హోగీ తెరీ’ తర్వాత ఈ బ్యూటీ మరో సినిమాలో నటించలేదు. తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన ‘సంఘమిత్ర’ నుంచి ఆమె తప్పుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే తన బాయ్‌ఫ్రెండ్ మైఖెల్‌ను శృతి పెళ్లి చేసుకోబోతోందని అందుకే సినిమాలకు గ్యాప్ వచ్చిందనే పుకార్లు వచ్చాయి. దీంతో తాజాగా తాను సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానో చెప్పింది శృతిహాసన్. “నటన ఒక్కటే నాకు ముఖ్యం కాదు. నా జీవితంలో ఇంకా చాలా విషయాలున్నాయి. నా గురించి వస్తున్న రూమర్స్ అన్నీ అవాస్తవాలే. నా గురించి నేను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత గ్యాప్ తీసుకున్నాను. నా బలం, బలహీనత తెలుసుకోవడానికి ఈ గ్యాప్ ఉపయోగపడింది. ఇకపై సినిమాలతో బిజీ అవుతాను”అని పేర్కొంది శృతి. ప్రస్తుతం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది శృతిహాసన్. తన తండ్రితో కలిసి త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’లో కూడా ఆమె నటిస్తోంది.

Comments

comments