Home తాజా వార్తలు వెబ్ సిరీస్‌లలో ఆఫర్లు

వెబ్ సిరీస్‌లలో ఆఫర్లు

shruti-hassanప్రియుడు మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయాక శృతిహాసన్ ప్రస్తుతం కెరీర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఒకటి, రెండు తమిళ సినిమాలకు కమిటైంది. అలాగే తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన ఓ సినిమాకు ఈ భామ ఓకే చెప్పిందని తెలిసింది. అయితే తాజాగా వెబ్‌సిరీస్‌ల ఆఫర్ల గురించి శృతిహాసన్ తెలియజేసింది. “డిజిటల్ వేదికపై వెబ్ సిరీస్‌లను ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నాకు పలు వెబ్ సిరీస్‌లలో నటించే ఆఫర్లు వచ్చాయి. కానీ వేటికి ఓకే చెప్పాలి? అన్నది ఆచితూచి ప్లాన్ చేస్తున్నా”అని శృతిహాసన్ చెప్పింది.

ఇక వెండితెరపై అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన శృతి కెరీర్ ప్రారంభంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమాయణం ఆమెకు మైనస్‌గా మారింది. విదేశాల్లో మ్యూజిక్ బ్యాండ్ ద్వారా గాయనిగా పాపులరయేందుకు చేసిన ప్రయత్నం ఆశించినంత సక్సెస్ కాలేదు. ప్రియుడితో లవ్ బ్రేకప్ తర్వాత తిరిగి కథానాయికగా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్‌లపైనా ఆసక్తిని కనబరుస్తోంది.

Shruti Haasan to act in web series