Home గాసిప్స్ లండన్ యాక్టర్ ప్రేమలో శృతి హాసన్..!!?

లండన్ యాక్టర్ ప్రేమలో శృతి హాసన్..!!?

Shruti Haasan dating with Micheal Corsale

లండన్ కు చెందిన యాక్టర్ మైఖెల్ కొర్సేల్ తో శృతి డేట్ చేస్తోందా? లేదంటే… మైఖెల్ పోలికతో ఉన్న తన మేనేజర్ తో డేట్ చేస్తోందా? ఇవే ఇప్పుడు ప్రతి తెలుగు సినీ అభిమాని మదిలో మెదిలే ప్రశ్నలు. ఎందుకంటే… వీళ్లిద్దరు, వాలెంటైన్స్ డే రోజున చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Shruti Hassan dating with Micheal Corsale

అయితే.. ముంబయి ఎయిర్ పోర్టులో మైఖెల్ తో శృతి ఉన్న సమయంలో ఓ ఫోటో జర్నలిస్ట్ తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా వైరలయింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అచ్చం శృతి మేనేజర్ లా ఉన్నాడని కొందరు చెబుతుండగా.. మరికొందరు ఆయన లండన్ యాక్టర్ అని చెబుతున్నారు.

మొత్తానికి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి శృతి మేనేజర్ కాదని… లండన్ యాక్టర్ మైఖెలేనని స్పష్టం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. శృతి తో ఓ వారం పాటు గడపడానికే ముంబయి వచ్చాడని టాక్. అంతే కాదు.. ఇద్దరు కలిసి వాలెంటైన్స్ డే ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారని సమాచారం. అయితే.. ఈ పుకారు పై ఇప్పటి వరకు శృతి పెదవి విప్పలేదు.