Search
Sunday 23 September 2018
  • :
  • :

యువకులపై ఎస్ఐ దౌర్జన్యం..

SI Attacked On Youngsters In Kamareddy Dist
రాజంపేట్‌ః రాజంపేట మండల కేంద్రంలో వైన్స్ వద్ద పోలీసులకు యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. గురువారం రాత్రి 9 గంటలకు ఈ సంఘటన జరిగిందని కొండపూర్ యువకులు తెలిపారు. వివరాలలోకి వెళ్తే.. రాత్రి బైక్ పైన కొండాపూర్ నుండి మండల కెంద్రమైన రాజంపేట వైన్స్‌కు వచ్చి బీర్లు కొనుక్కొని వెళ్తుండగా అటుగా జీపు పై వచ్చిన ఎస్ఐ రవిగౌడ్ మరియు సిబ్బంది అకారణంగా దురుసుగా ప్రవర్తిస్తు తమను చితకబాదరని కొండాపూర్ ఉపసర్పంచ్ బాల్‌రాజు ఇతర యువకులు తెలిపారు. తమ గ్రామంలోని బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నందున రాజంపేటకు వచ్చి ఖరీదు చేశామని యువకులు వాపోయారు. వైన్స్ వారికి కొమ్ము కాస్తు తమపై దౌర్జన్యం చెశారని రాజంపేట ఎస్ఐ పై కామారెడ్డి ఎస్పి శ్వేతారెడ్డికి కొండాపూర్ యువకులు ఫిర్యాదు చేశారు. మేం ఎం తప్పు చేశాం మమ్మల్ని ఎందుకు కొడుతున్నావ్ అని అడిగితే నాతొ ఎదురు మాట్లాడతారా అంటు తమను చితక బాదారని ఎస్పికి ఫిర్యాదు చేశారు. అకారణంగా తమపై దౌర్జన్యం చెసిన ఎస్ఐపై చర్య తీసుకొవాలని వైన్స్ యజమానులకు తొత్తుగా మారాడని, వైన్స్‌లో మద్యం కొనుగొలు చేస్తున్న వారిని కొట్టడం ఎంత వరకు సబబని యువకులు ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఎస్పి ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. కామారెడ్డి రూరల్ సిఐ భిక్షపతి, దొమకొండ ఎస్ఐ నరేందర్ రాజంపేట వచ్చి జరిగిన సంఘటనను విచారించి వెళ్లారు. శుక్రవారం కొండాపూర్ యువకులు ఎస్పి ఆఫీస్ ముందు తమకు జరిగిన అన్యాయాన్ని విలేఖరులకు తెలిపారు.

Comments

comments