Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రశాంతంగా ముగిసిన ఎస్‌ఐ రాత పరీక్ష

exams-siమహబూబ్‌నగర్ క్రైం : ఆదివారం జరిగిన పోలీసు సబ్‌ఇన్ స్పెక్టర్ రాత పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ ప్రత్యే క పోలీసు సిబ్బందితో పర్యవేక్షించారు. జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ పరీక్షలకు జిల్లాలో 11,988 మంది అభ్యర్థులు హాజరు కావల్సి ఉండగా 11,976 మంది హాజరైయ్యారు. ప్రతి కేంద్రం వద్ద పెద్ద యెత్తున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్టణ శివారు ప్రాంతలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు పహార నిర్వహించారు. దూర ప్రాంతల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక ప్రవేట్ బస్సులు, వాహనాల ద్వార వారిని పరీక్ష కేంద్రలకు తరలించారు. అభ్యర్థులకు ఏలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా గెజిటెడ్ అధికారుల సేవలు వినియోగించుకున్నారు. జిల్లా ఎస్పీ గత మూడు రోజులుగా ఇచ్చిన వివిధ ప్రకటనల ద్వార పరీక్ష కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అభ్యర్థులు కూడా సమస్యలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరైయ్యారు. నకిలి అభ్యర్థులతో పరీక్ష రాయిస్తే అభ్యర్థితో పాటు పరీక్షకు మాజరైన అభ్యర్థిపై కుడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చేసిన ఆయన హెచ్చారికలు ఫలిం చాయి. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరిక్ష కేంద్రాలలోకి వచ్చారు. పరీక్ష వ్రాసేందుకు వచ్చే అభ్యర్థులు తమ వెంట ఏలాంటి మొబైల్, బ్లూటుత్, గడియా రాలు, క్యాల్యూక్ లేటర్లు, ఇతర ఎలాక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రాకుండా ఆధికారులు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు బ్రోకర్లు అభ్యర్థులను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారని వారి మాటలు నమ్మ వద్దని పోలీసులు పెట్రోలింగ్ చేస్తు మైక్‌లో ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతు ఎస్‌ఐ రాత పరిక్షలు ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు ఆధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అయన కృతజ్ఞతలు తెలిపారు. పరీక్ష కేంద్రల వద్ద ఏలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రంగం ముందస్తు బందోబస్తు చర్యలు చెపట్టిందన్నారు. అభ్యర్థులు కుడా నిర్బయంగా పరీక్షలు రాయడం అనందం కలిగించిందన్నారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇతర విభాగాల్లో ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

comments