Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

SSC-EXAM

హైదరాబాద్‌: ఎస్ఐ, కానిస్టేబుల్ ల నియామక ప్రాథమిక పరీక్షల తేదీలను రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ వెల్లడించింది. ఎస్ఐ ఉద్యోగాలకు ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 2న ఉదయం ఐటీ, కమ్యూనికేషన్స్ ఎస్ఐ, మధ్యాహ్నం ఫ్రింగర్ ప్రింట్స్ బ్యూరో ఎఎస్ఐ నియామక అర్హత నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ ఛైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. ఇక సెప్టెంబరు 30న కానిస్టేబుల్  నియామక ప్రాథమిక పరీక్ష ఉంటుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 10 ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.  కమ్యూనికేషన్స్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్ ఎఎస్ఐ పరీక్షలు మాత్రం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Comments

comments