Home తాజా వార్తలు ఎస్‌ఐ మృతదేహం లభ్యం…

ఎస్‌ఐ మృతదేహం లభ్యం…

SI Kota Vamsidhar feared drowned in KEB canal

అమరావతి: పాపవినాశనం వద్ద కాల్వలో గల్లంతైన ఎస్‌ఐ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. ఎపిలోని చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద ఎస్‌ఐ వంశీధర్ మృతదేహం గుర్తించారు. శనివారం అవనిగడ్డ వెళ్తూ కరకట్ట వద్ద వంశీధర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నీట మునిగిపోతున్న తల్లిని కాపాడి వంశీధర్ గల్లంతయ్యాడు. దీంతో నిన్నటి నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వంశీధర్ మృతదేహం కోసం తీవ్రంగా గాలించాయి. కాగా, వంశీధర్ తూర్పు గోదావరి జిలా రామచంద్రాపురం ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సంఘటనతో వంశీధర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.