Home కరీంనగర్ ఎస్.ఐ స్వర్ణజ్యోతికి జాతీయస్థాయిలో ద్వితీయస్థానం

ఎస్.ఐ స్వర్ణజ్యోతికి జాతీయస్థాయిలో ద్వితీయస్థానం

SI Swarnajyoti is the second national award national level
కరీంనగర్ క్రైం:  కరీంనగర్ కమీషనరేట్‌లోని ఫింగర్ ప్రింట్స్ విభాగంలో ఎస్.ఐగా పనిచేస్తున్న వి.స్వర్ణజ్యోతి వేలిముద్రల విభాగంలో అసాధారణమైన ప్రతిభను కనబర్చినందుకు జాతీయస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచారు. జాతీయస్థాయిలో ద్వితీయస్థానం సాధించిన ఎస్.ఐ స్వర్ణజ్యోతిని శనివారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందిచారు. ఎస్.ఐ స్వర్ణజ్యోతి 2012 సంవత్సరంలో పోలీస్‌ శాఖలో ఫింగర్‌ప్రింట్స్ విభాగంలోఎ.ఎస్.ఐగా చేరారు. 2017 సంవత్సరంలో ఎస్.ఐగా పదోన్నతి పొందారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కోరుట్లలో 2016 సంవత్సరంలో జరిగిన రాత్రి కన్నపునేరంలో వేలిముద్రల సేకరణ, అసాధారణ ప్రతిభను కనబర్చినందుకుగాను ఆమె జాతీయస్థాయిలో ద్వితీయస్థానంలో ఎంపికైంది. పైన పేర్కొన్న నేరం సంవత్సరాలు గడిచినా చేధించలేకపోవడంతో ఇక్కడ సేకరించిన ఆధారాలను నేషనల్ క్రైం బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) లోని నేషనల్ ఫింగర్ ప్రింట్స్ విభాగానికి పంపించారు. దేశవ్యాప్తంగా వివిధ రకాల నేరాలకు నింధితుల వేలిముద్రలతో పోల్చిచూడగా మహారాష్ట్రలోని లవకుశ్ ప్రభుబోస్లేతోపాటు మరో ముగ్గురు నేరానికి పాల్పడినట్టు నిర్ణారణ అయింది. వెంటనే వీరిని అరెస్టు చేయడంతో పాటు జగిత్యాల జిల్లాలో వీరిపై పిడి యాక్ట్‌ను అమలు చేశారు. సదరు దొంగల అరెస్టు ద్వారా దేశవ్యాప్తంగా 45 నేరాలు చేధించడంతో పాటు 26 లక్షల రుపాయల విలువ చేసే సొమ్ము స్వాధీనం అయింది. ఫింగర్‌ప్రింట్స్ విభాగంలో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి గత సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా ఎంపికలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరానికిగాను కరీంనగర్ కమీషనరేట్‌కు చెందిన ఫింగర్ ప్రింట్స్ విభాగం ఎస్.ఐ వి.స్వర్ణజ్యోతి దేశవ్యాప్తంగా ద్వితీయస్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి ఫింగర్ ప్రింట్స్ డైరెక్టర్ల్ సమావేశంలో ఎస్.ఐ జ్యోతి ఈ పతకాన్ని అందుకోవడం తోపాటు 7.500 రుపాయల నగదును రివార్డుగా పొందారు. కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి పాటు జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు ఆమెను అభినందించారు.