Home జాతీయ వార్తలు సిద్ధరామయ్య రాజీనామా…

సిద్ధరామయ్య రాజీనామా…

Sidha
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిఎం పదవికి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాడానికి జెడిఎస్ కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య గవర్నర్ ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. కర్నాటకలో తమ మద్దతుతో జెడిఎస్ ప్రభుత్వాన్నిఏర్పాటు చేయనుందని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను సిద్ధరామయ్య కోరినట్టు సమాచారం. కాగా గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందన్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్టో కాంగ్రెస్, జెడిఎస్ నేతలు గవర్నర్ తో భేటీ కానున్నారు.